జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 27 at 20.33.41

TRINETHRAM NEWS

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం :ఎమ్మెల్యే బాలు నాయక్
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
జనవరి 27, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అందజేయడం కొరకు డిండి మండలంలోని టీ గౌరారం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్నారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం మండలంలోని టీ గౌరారం గ్రామంలో ఈ నాలుగు పథకాలను అమలు చేయుటకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గణతంత్ర దినోత్సవ సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల భాగంగా బడుగు బలహీన వర్గాల నిరుపేద కుటుంబాల అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రజలు ఎవరు ఆందోళన చేయవలసిన అవసరం లేదని ఇది ప్రజా ప్రభుత్వం అని, ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని గుర్తు చేశారు ఈ పథకాల అమలు నిరంతర ప్రతి అనే అర్హులు ఎవరు ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వర్ రావు, పిఎసిఎస్ చైర్మన్ తుమ్ నాగార్జున రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, నల్లవెల్లి దామోదర్ రెడ్డి మండల ప్రత్యేక అధికారి సాయి బాబా, తాసిల్దార్ అంబటి ఆంజనేయులు ఎంపీడీవో వెంకన్న, దొంతినేని నాగేశ్వరరావు లౌక్య నాయక్, గోపాల్ నాయక్, నూకం వెంకటేష్, పొలం లక్ష్మణ్, గడ్డమీద సాయి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page