WhatsApp Image 2025 01 27 at 18.25.59
శ్రీ ధర్మశాస్త్ర వ్యవస్దాపకులు కౌటం బాబు
అనార్దుల అకలి తీర్చడం ప్రతి ఒక్కరు బాధ్యత గా తీసుకోవాలి
రామగుండం మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కోరుకంటి చందర్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. సోమవారం గోదావరిఖని పట్టణం పోచమ్మ దేవాలయం ఆవరణలో ఉచిత ఇడ్లీ సాంబర్ పంపణీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా అనార్దుల అకలి తీరిస్తు మధ్యాహ్నం భోజనం అందిస్తున్న ధర్మశాస్త్ర నిత్య అన్నదాన వేదిక ఉదయం పూట పేద వారు అకలితో బాధపడవద్దని ఉచిత ఇడ్లీ సాంబారు అందించడం గొప్ప విషయం అన్నారు.
పేదవారికి అండగా నిలుస్తున్న శ్రీ ధర్మశాస్త్ర నిత్య అన్నదాన వేదిక వ్యవస్దాపకులు కౌటం బాబును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రామగుండం నియోజకవర్గం లో పేదవారికి సేవ చేయడం తమ విధిగా భావించాన్నారు. తాము ఎమ్మెల్యే గా 5 ఎళ్లు కాలంలో పేద వారికి అనాధలకు అన్ని విధాలుగా అండగా నిలిచామని విజయమ్మ పౌండేషన్ ద్వారా సేవ కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేసారు. ఈ కార్యక్రమం లో తాజా మజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు శ్రీ ధర్మశాస్త్ర నిత్యఅన్నదాన వెదక వ్యవస్దాపకులు కౌటం బాబు నాయకులు చల్లా రవీందర్ రెడ్డి నారాయణదాసు మారుతి సురేష్ నీరటి శ్రీనివాస్ ఇరుగురాళ్ల శ్రావన్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
