త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా మార్కాపురం
తేది :23.1.2024.మార్కాపురం పట్టణం.
*–ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి & రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ బాబు జన్మదినోత్సవం సందర్భంగా నేడు బాలుర ఉన్నత పాఠశాల మార్కాపురం నందు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి పాల్గొని ప్రసంగించెను.ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ విద్యార్థుల కొరకు అనేక సంస్కరణలు తీసుకొని రావడం జరిగినది.కనుక విద్యార్థులందరూ మెరుగైన భవిష్యత్ కొరకు ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకొని ఉన్నత ఉద్యోగాలు చేపట్టాలని తెలిపారు.
అనంతరం దాదాపు ఒక వేయి మంది విద్యార్థులకు తన సొంత ఖర్చుతో స్వీట్ పంపిణీ చేయగా మార్కాపురం మున్సిపల్ హ్యాట్రిక్ కౌన్సిలర్ తాళ్ళపల్లి సత్యనారాయణ విద్యార్థులందరికీ పెరుగు పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమిష్టి కృషితో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.
దానికి ముందు గడియారం స్తంభం సెంటర్లో నిర్వహించిన జాతీయ రహదారి మాస ఉత్సవం లో విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App