WhatsApp Image 2025 01 21 at 15.50.40
అర్హులైన తెలంగాణ ప్రజలందరికీ ఆరు గ్యారెంటీల పథకాలు అమలు చేయాలి.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్
భారత రాష్ట్ర సమితి (brs) డిండి మండల నాయకులు ఏమి నేటి వెంకట్ ద్రావిడ్ మాట్లాడుతూ.
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, మహాలక్ష్మి యువ వికాసం, హామీలు ఇచ్చిన పథకాలను అమలు చేయాలని తెలంగాణలోని ప్రతి గ్రామ గ్రామాన ఈ పథకాలలో ఏకపక్షం కాకుండా గ్రామాలలో ఉన్న అన్ని వర్గాలకు, అర్హులైన వారందరికీ ఈ పథకాలు అమలు చేయాలని కోరుతున్నాం.
రాబోయే సర్పంచ్ ఎలక్షన్లు ముందుగా దృష్టిలో పెట్టుకొని సర్పంచ్ ఎన్నికల కోసం ప్రజలను మోసం చేసే విధంగా మీరు అమ్మాయిలలో గాని, రేషన్ కార్డులలో గాని, మోసపూరితమైన మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు.
ఎలక్షన్లలో ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండి,6 గ్యారంటీ పథకాలను అర్హులైన వారందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
