రోడ్డు ట్రాఫిక్ సైన్ లపై అవగాహనా ఉండాలి
రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రయాణం చేసి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలి
ట్రాఫిక్ ఏసిపి నరసింహులు
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్ లో గల వ్యాన్ అసోసియేషన్ వారి కార్యాలయం ఆవరణలో ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ చిహ్నంల, రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఏసిపి జాడి నరసింహులు ముఖ్యఅతిథిగా హాజరై డ్రైవర్స్ తో మాట్లాడడం జరిగింది
సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ గత సంవత్సరంలో నాలుగు లక్షల ప్రమాదాలు జరగగ అందులో 1,73 వేల పైచిలుకమంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు. అందులో ఎక్కువ శాతం యువతే ఉంటుందని చిన్నచిన్న తప్పిదల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఇట్టి ప్రభావం దేశ ఆర్థిక ప్రగతి నష్టం కలిగిస్తుంది అని అన్నారు. వ్యాన్ డ్రైవర్ వాహనం నడిపే సమయంలో రోడ్డుపై ఉన్న చిహ్నాలను గురించి అవగాహన కలిగి జాగ్రత్తగా గమనిస్తూ వాహనాల నడపాలని, వాహనాలను రహదారిపై ఆపినప్పుడు పూర్తిగా రోడ్డున దింపి ఆపాలని సూచించారు.
అదేవిధంగా వ్యాన్లు రాత్రి వేళలో ప్రయాణం చేసినప్పుడు గాని పార్కింగ్ చేసినప్పుడు గాని ఆ మార్గంలో ప్రయాణం చేసే ఇతర వాహనాలకు వాహనం కనిపించే విధంగా వ్యాన్ ఇరుపక్కల వెనుక భాగంలో కూడా రేడియం స్టిక్కర్ను అంటించాలని, వాహనం ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఆగిపోయి నట్లయితే వాహనం చుట్టూ జాగ్రత్తలు పాటిస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బంది కలగకుండా సూచికలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ద్విచక్ర వాహనం నడిపినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరాలని డ్రైవర్లకి అవగాహన కల్పించడం జరిగింది.
పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, పెద్దపల్లి, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధు, ఎస్ ఐ సహదేవ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App