తెలంగాణ భవన్ లో మెతుకు ఆనంద్ మీడియా సమావేశం త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గం ప్రతినిధి
ఈరోజు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
ఈ సమావేశంలో BRS రాష్ట్రనాయకులు నాయకులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి, మాజీ ZPTC మహిపాల్, సీనియర్ నాయకులు మేక చంద్ర శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, గోపాల్, PACS వైస్ చైర్మన్ పాండు పాల్గొన్నారు.
సమావేశంలో డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ…
నిన్న యాదాద్రి భువనగిరి BRS పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని ఖండిస్తున్నాను.
ఆరు గ్యారంటీలు అమలు చెయ్యటం చేతకాని CM రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.
రాష్ట్రంలో రేవంత్ కుటుంబ సభ్యులు రాజ్యాంగేతర శక్తులుగా మారి పెత్తనం చెలాయిస్తున్నారు.
ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా వికారాబాద్ జిల్లాలో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డికి అధికారులు పార్టీ కార్యకర్తలుగా మారి రాచ మర్యాదలు చేస్తున్నారు, లగచర్ల ఘటన తర్వాత వికారాబాద్ జిల్లా కలెక్టర్ తన కార్యాలయం నుంచి బయటకు వచ్చి మరీ తిరుపతి రెడ్డికి స్వాగతం పలకడం ఏంటి?
ఏ పదవి లేని తిరుపతి రెడ్డికి కలెక్టర్ ప్రొటొకాల్ ను ఉల్లంఘించి మర్యాదలు ఎందుకు చేస్తున్నారు?
అధికారుల సమక్షంలో స్కూల్ విద్యార్థులను ఎండలో నిలబెట్టి మరీ తిరుపతి రెడ్డికి స్వాగతం పలికించడం ఏంటి?
ప్రభుత్వ భవనాలకు తిరుపతి రెడ్డి ఏ హోదాలో వెళ్లి భూమి పూజలు చేస్తున్నారు?
ఏ హోదా లో కల్యాణ లక్ష్మి, CMRF చెక్కులు కూడా అధికారుల సమక్షం లో తిరుపతి రెడ్డి పంచుతున్నారు?
వార్డు మెంబర్ కూడా కానీ తిరుపతి రెడ్డి కి దక్కుతున్న ప్రొటో కాల్ ఏ సందేశం ఇస్తోంది?, రేపు తిరుపతి రెడ్డి పేరు ను శిలాఫలకాల మీద కూడా వేస్తారేమో?
తిరుపతి రెడ్డి కి దక్కుతున్న ప్రభుత్వ మర్యాదలే ప్రజాస్వామ్యమా ? ఇదేనా రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రజాస్వామ్య ఏడో గ్యారంటీ ?
తిరుపతి రెడ్డి లగచర్ల లో భూ సేకరణకు బూతులు తిడుతూ రైతులను బెదిరించారు.
అల్లు అర్జున్ పై FIR నమోదు అయినప్పుడు కొండారెడ్డి పల్లి లో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్యకు కారకుడైన తిరుపతి రెడ్డి పై FIR ఎందుకు నమోదు కాలేదు? రేవంత్ రెడ్డి సోదరుడికి రాజ్యాంగం లో ఏమైనా ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయా?
హైడ్రా కమిషనర్ గారు “మీరు దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎందుకు కూల్చడం లేదు”?
తిరుపతి రెడ్డి ఇపుడు వికారాబాద్ కు సీఎం అయ్యారు.
రేవంత్ రెడ్డి అనేక పోరులతో సతమతమవుతున్నారు.
రేవంత్ రెడ్డికి ఇంటి పోరుతో పాటు అధిష్టానం పోరు, ఇక్కడి కాంగ్రెస్ నేతల పోరు మంత్రుల పోరు తదితరాలు ఉన్నాయి.
ఇన్ని సమస్యలతో సతమవుతున్న రేవంత్ రెడ్డి కి అసహనం రాకుండా ఎందుకు ఉంటుంది ?
అందుకే తన సమస్యల నుంచి ద్రుష్టి మళ్లించుకునేందుకు రేవంత్ రెడ్డి KTR మీద తప్పుడు కేసు పెట్టారు.
ఆరు గ్యారంటీలు అమలు చేయడం చేత కానీ ఈ రేవంత్ రెడ్డి KTR ను ఆరు సందర్భాలలో అరెస్టు చేయడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు.
ప్రస్తుతం ఉన్న మహానగరం వదిలేసి ఫ్యూచర్ సిటీ మీద పడ్డారు రేవంత్ రెడ్డి.
మూసి సుందరీకరణ, హైడ్రా పేరిట ఇండ్లు కూల్చివేస్తూ కొత్తగా కడుతామంటే ప్రజలు రేవంత్ ను ఎలా నమ్ముతారు?
కేసీఆర్ ది కుటుంబ పాలన కాదు రేవంత్ రెడ్డి దే కుటుంబ పాలన అని ఆయన కుటుంబ సభ్యుల జోక్యాలు రుజువు చేస్తున్నాయి.
అమలు కాని హామీలు ఇచ్చి రేవంత్ మాట తప్పారు.
కాంగ్రెస్ నేతలు గ్రామాలకు వస్తే ప్రజలు నిలదీయాలి.
రైతు భరోసాను 15 వేలు ఇస్తామని 12 వేలకు కుదిస్తున్నారు, రైతుకు మరియు కౌలు రైతుకు రేవంత్ కొట్లాట పెట్టారు.
కేవలం స్థానిక ఎన్నికలలో బయట పడేందుకు రేవంత్ హామీల అమలు పేరిట డ్రామాలు చేస్తున్నారు.
ఇందిరమ్మ కమిటీల్లో కాంగ్రెస్ నేతలనే వేస్తున్నారు, ఇందిరమ్మ ఇండ్లకు కావాలనే అందరి ఫోటో లు తీసుకుంటున్నారు.
వికారాబాద్ జిల్లా ను స్పీకర్ ప్రసాద్ కుమార్ కు అప్పగిస్తే సీఎం రేవంత్ కు వచ్చిన నష్టమేమిటి?
సీఎం ఎలా ఉండకూడదో రేవంత్ ఆలా ఉంటున్నాడు.
రేవంత్ రెడ్డి అరాచకాలపై BRS పోరాడుతూనే ఉంటుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App