నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్‌.. మాజీ మంత్రి హరీశ్‌రావు గృహ నిర్బంధం

TRINETHRAM NEWS

నేడు ఏసీబీ విచారణకు కేటీఆర్‌.. మాజీ మంత్రి హరీశ్‌రావు గృహ నిర్బంధం..

Trinethram News : హైదరాబాద్‌ : ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి ఆయన వెళ్లనున్నారు..

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయన్ను గృహ నిర్బంధం చేశారు..

మరోవైపు కేటీఆర్‌ నివాసానికి ఎమ్మెల్సీ కవిత సహా భారాస ఎమ్మెల్యేలు చేరుకున్నారు. భర్త అనిల్‌తో కలిసి కవిత అక్కడికి వచ్చారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌ తదితరులు అక్కడికి చేరుకున్నారు. న్యాయవాది రామచంద్రరావు, లీగల్‌ టీమ్‌ కేటీఆర్‌ ఇంటికి వచ్చారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top