ఉగ్రవాద అంతానికి రాజకీయ పక్షాలన్నిఏకంకావాలి.రాజిరెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
దేశ రక్షణ సమౌక్యత కోసం రాజకీయ పక్షాలన్ని ఏకమై ఉగ్రవాద మూలాల అంతానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర సర్పంచుల సంగం నేత మండల సర్పంచుల సంగం మాజీ అధ్యక్షులు కె రాజిరెడ్డి అభిప్రాయపడ్డారు బుధవారం దోమ మండల కేంద్రం లోని జిల్లాపరిషత్ పాఠశాల ప్రార్థన సమయంలో వికారాబాద్ జిల్లా వీర జవాన్ల సంగం నాయకులుగురునాథ్ రెడ్డి లింగామయ్యల ఆధ్వర్యంలో చత్తిస్గడ్ బీజపూర్ జిల్లాలోఉగ్రవాదుల దాడిలో అమరులైన 8 మంది గురు వీర జవాన్లకు ఏర్పాటు చేసిన నివాళుల కార్యక్రమం లో పాల్గొనిప్రసంగించారు.ఈసందర్బంగా రాజిరెడ్డి మాట్లాడుతూ దేశం నలు మూలల్లో త్రివిద దళాల భద్రత నడుమ మనం క్షేమంగాఉన్నామని కానీ దేశ బోర్డర్లో ఉంటున్న సైనికుల పైదాడులు జరుగుతూనే ఉన్నాయని వారి కుటుంబాలు వీదినపడుతున్నాయని అందుకు రాజకీయ పక్షాలాన్ని ఏకమై ఉగ్రవాదుల నిర్ములన్న కోసం కేంద్రం తీస్కుంటుంన పలు జాగ్రతలకు సపోర్ట్ చేయాలనీ అన్నారు దేశ రక్షణ విషయంలో సంఘటీతనిర్ణయాలు తీసుకోవాలని ప్రతి పౌరుడు దేశ రక్షణ కు తన వంతుకృషిచేయాలన్నారు మాజీ సైనికులుగురునాథ్ రెడ్డిలింగమయ్యాలుమాట్లాడుతూ దేశ రక్షణలో మేము విధులు నిర్వహించామని మాబాధలుఅనేకంగా ఉంటాయని తోటి సైనికులు ఉగ్రవాదులదాడిలో అమరులు అవుతుంటే చాలా బాధ గా ఉంటుంది అని ఆవేదన వ్యక్త పరిచారు అన్ని పార్టీలు కలిసి దేశ రక్షణ విషయంలో తగినచొరవతీసుకోని ఉగ్రవాదుల ఏరి వెతకు కృషి చేస్తూ అమరుల కుటుంబాలను అన్నిరకాలఆదుకోవాలని కోరారు పాఠశాలాప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాఘవేంద్ర రెడ్డి లు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ తో వుంటూ దేశ రక్షణ కోసం ముందు ఉండేలాఉత్సాహంచూపాలన్నారు ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు బంగ్లా యాదయ్య గౌడ్ ఉపాధ్యాబృందం విద్యార్థులు పాల్గొన్నారు అమరజవాన్లకు నివాళులు అర్పించి వారి సేవలకు గుర్తుగా రెండు నిముషాలు మౌనం పాటించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App