తల్లిదండ్రులు ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చూడాల్సిన బాధ్యత పిల్లలదే

TRINETHRAM NEWS

తల్లిదండ్రులు ట్రాఫిక్ రూల్స్ పాటించేలా చూడాల్సిన బాధ్యత పిల్లలదే..

పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ ల ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు సేఫ్టీపై, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు

రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (డఐజి ) ఆదేశాల మేరకు రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో గాయత్రి స్కూల్

త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి

పెద్దపల్లి లో రోడ్డు సేఫ్టీపై, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది

ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతీ ఒక్కరు డ్రైవింగ్‌ లైసెన్సు కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలన్నారు. దేశ భవిష్యత్‌ యువత చేతిలో ఉందని, తొందరపాటుతనంతో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దన్నారు. తమ తల్లిదండ్రులు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ రోడ్ సేఫ్టీ పాటించేలా చూడాల్సిన బాధ్యత ఉందని, అతి వేగంతో, అజాగ్రత్తగా వాహనాలు నడపడంతో నడిపే వారితోపాటు ఎదుటి వారు కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుందని తల్లితండ్రులకు తెలపాలని సిఐ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేపించడం జరిగింది. విద్యార్ధి దశ నుండే ట్రాఫిక్ రూల్స్ పై, రోడ్ సేఫ్టీ లపై అవగాహనా ఉండాలని, తల్లితండ్రులకు హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, వాహనాలకు సంబంధిత పత్రాలన్నీ ఉంచుకోవాలని సూచించాలని తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top