విద్యుత్ చార్జీల పెంపుపై అనపర్తిలో భారీ నిరసన
త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం
అనపర్తి:
కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడంపై అనపర్తి వైఎస్ఆర్సిపి శ్రేణుల నిరసనల గళం
అనపర్తి వైకాపా కార్యాలయం నుండి అనపర్తి మెయిన్ రోడ్ దేవీచౌక్ సెంటర్ మీదుగా నిరసన ర్యాలీ నిర్వహించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
వైకాపా కార్యాలయం నుండి దుప్పలపూడి సబ్ స్టేషన్ వద్ధ గల విద్యుత్ కార్యాలయానికి చేరుకుని పెంచిన విద్యుత్ చార్జీలు తక్షణం తగ్గించాలని విద్యుత్ ఏ.ఇ వారికి వినతిపత్రం సమర్పించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి తదితర వైకాపా నాయకులు.
పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణం తగ్గించాలంటూ ప్రజల పక్షాన నినదించిన వైకాపాశ్రేణులు.
ప్రజలపై భారం మోపుతున్న చంద్రబాబు సర్కార్ చర్యలను నిరసిస్తూ నియోజకవర్గ కేంద్రమైన అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకుల ఆందోళన, నిరసనలు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచమని కూటమి నేతలు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 15 వేల కోట్లకు పైగా భారాన్ని మోపడాన్ని మాజీ ఎమ్మెల్యే దుయ్యబట్టారు.
కూటమి ప్రభుత్వ అరాచకాలపై పార్టీ అద్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల కొల్లాటి ఇజ్రాయిల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు, రంగంపేట అనపర్తి, పెదపూడి, జడ్పిటిసిలు పేపకాయల రాంబాబు, సత్తి గీతా వరలక్ష్మి వెంకటరెడ్డి, పేపకాయల వెంకటరమణ, పెదపూడి బిక్కవోలు మండల పార్టీలకు కన్వీనర్లు గుత్తుల వెంకటరమణ, పోతుల ప్రసాద్ రెడ్డి, అనపర్తి, రంగంపేట మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు అంసూరి సూర్యనారాయణ, అనపర్తి గ్రామ పార్టికన్వీనర్ నల్లమిల్లి మురళీ మోహన బాలకృష్ణారెడ్డి, జిల్లా పార్టీ కార్యదర్శి పివి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ లు అడబాల వెంకటేశ్వరరావు, గోవిందు, పార్టీ నాయకులు మండ రాజారెడ్డి, గండ్రెడు సర్పంచ్ కుడిపూడి శ్రీను, మామిడాడ పార్టీ కన్వీనర్ ద్వారంపూడి సూర్యనారాయణరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు సాంబత్తుల చంటి, పెదపూడి ఎంపీటీసీ దుర్గాప్రసాద్, పాలమూరు ఉప సర్పంచ్ సత్తి సూరారెడ్డి, పైన ఎంపీటీసీ సుధాకర్, వల్లభశెట్టి రామ సతీష్, కోనాల సాయి రామారెడ్డి, మాజీ ఎంపీటీసీ కర్రి సర్రెడ్డి, రాయుడు మురళి, బుద్దాల శ్రీను, ఎంపీటీసీ చందాళ్ళ వెంకటరమణ, గాజంకి వరద, సత్తి హరి ప్రసాద్ రెడ్డి, ఏపీ మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ సత్తి నాగిరెడ్డి, మాజీ సాప్ డైరెక్టర్ గుబ్బల లాజర్ బాబులతో పాటు పలువురు నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App