TRINETHRAM NEWS

గడచిన 5 యేళ్ళ కాలంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనుడు వైయస్ జగన్ – ఎమ్మెల్యే నల్లమిల్లి

త్రినేత్రం: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం

విద్యుత్ చార్జీలు పెంపు మీద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయమని జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడం అంటే తాను పిచ్చి తుగ్లక్ కి ఏమాత్రం తీసిపోను అని నిరూపించుకోవడం లాంటిదే

తాను పెంచిన విద్యుత్ ఛార్జిల మీద తన నాయకుల చేతనే ధర్నా చేయించుకోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి బహుశా స్థానిక నాయకులకు కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది అవగాహన లేదు. చార్జీలు ఏ విధంగా పెంచబడ్డాయి, ట్రూ అప్ చార్జెస్ అంటే ఏంటి? ఈ ఆర్ సి ఏ విధంగా డైరెక్షన్స్ 2021 నుండి 2024 వరకు ఇచ్చింది అనేది వారికి అవగాహన లేదు. ఈ ఆర్ సి ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు అమలు అవుతున్నాయి. ఈ పాపం వైసిపిదే. జగన్మోహన్ రెడ్డి దే, ఇవేమి తెలియక దున్న పోతు ఈనింది అంటే దూడ ని కట్టండి అన్నట్లు గా వైసిపి నాయకులు ముందుకు వెళుతున్నారు.
ఈ ఆర్ సి ఆదేశాలు 20021-2024 కి ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది.

20021-22 కి ఏపీ ఈ ఆర్ సి ట్రూ అప్ చార్జీలు అప్రూవ్ చేసింది 3082 కోట్లు, 2022-23 కి 6073 కోట్లు, 2023-24 కి 11000 కోట్లు.. మొత్తం దాదాపు ఇరవై వేల కోట్లు ట్రూ అప్ చార్జెస్ అదనపు భారం ప్రజల పై వేశారు.
జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు నాడు ఏపీ ఈ ఆర్ సి ఆదేశాలు ఇచ్చింది, ఆనాడు ఏపీ ఈ ఆర్ సి ఈ ఆదేశాలు 2024 డిసెంబర్ నుండి అమలు కావాలి అని చెప్పింది. ఇది ఎవరి పాపం అనేది ధర్నా చేస్తున్న నాయకులు సమాధానం చెప్పాలి

2014 లో లోటు విద్యుత్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడితే 2019 నాటికి మిగులు విద్యుత్ స్టేట్ గా ఏపీ ని చంద్రబాబు తీర్చిదిద్దారు, దాన్ని 10,000 లోటు కి జగన్ తీసుకువెళ్లారు.
జెన్ కో & ట్రాన్స్ కో లను సర్వనాశనం చేసిన ఘనత జగన్ దే, యూనిట్ రూ 5 కి జెన్ కో ని విద్యుత్ లభిస్తుంటే కమీషన్ల కోసం 8 రూ కి పొరుగు రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు చేసింది జగన్ ప్రభుత్వం,
ప్రజలపై భారం పెంచడానికి ఇన్ని తప్పులు చేసిన జగన్ మోహనరెడ్డిదా ఈపాపం? లేక కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వందా చెప్పాలి?
ఎన్నికలలో ప్రజా వ్యతిరేకతకు భయపడి ఈ ఆర్ సి ఆదేశాలను ఈ ఆర్ సి చేతనే డిసెంబరు 2024 నుండి అమలు చేయాలని చెప్పించిన ఘనుడు వైయస్ జగన్, తన ఐదేళ్ళ పాలనలో 9 సార్లు ఛార్జీలు పెంచి నేడు ధర్నాలు చేయించడం అంటే పిచ్చి తుగ్లక్ చర్యగా భావించాలి ఇక్కడ రైతులు గురించి మాట్లాడుతున్న తింగరి గంగిరెడ్డి కి గత ఐదేళ్ళూ ప్రేమ ఏమైపోయిందని ప్రశ్నిస్తున్నా, మొన్న రైతు వ్యతిరేక విధానాలను కూటమి ప్రభుత్వం అవలంభిస్తుందని ఆయన చేసిన హడావిడికి రైతుల నుండి స్పందన కరువైతే సాగునీటి సంఘాల ఎన్నికలను, బహిష్కరిస్తున్నామని తోక ముడిచారు.
గత ఐదేళ్ళలో ధాన్యం కొనుగోలులో మీరు దిగమింగిన సొమ్మెంత? మీ తోడల్లుడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉంటూ బస్తాకి 300-400 తక్కువకి కొంటుంటే మీరేం చేసారు?
ఎవరైనా బస్తాకు రూ 50 కి ఎక్కువకు కొంటుంటే నియంత్రించిన మీ తోడల్లుడిని ఏం చేసారు అందులో మీకు ముట్టింది ఎంత? ధాన్యం సొమ్ములు ఆరేసి నెలలకు గానీ రాకపోయినా మీరెపుడైనా నోరు మెదిపారా?
సింగంపల్లి ఈలకొలను షిప్ట్ ఆపరేటర్ పోస్టులను అమ్ముకోవడం వాస్తవం కాదా?
గడచిన ఐదేళ్ళలో ఇక్కడ విద్యుత్ రంగం మౌళిక వసతుల కోసం మీరు చేసింది ఏంటి?
జమిలీ ఎన్నికలంటే ఏంటి? అసెంబ్లీ ఎన్నికలంటే ఏంటి? పార్లమెంటు ఎన్నికలు అంటే ఏంటో మీకు అవగాహనే లేదు. జమిలీ 2029 లో జరుగుతుంది అప్పుడు కూడా కూటమి ప్రభుత్వమే అధికారం దక్కించుకుంటుంది, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App