కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది

TRINETHRAM NEWS

కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మల్లిఖార్జున ఖర్గే.. షర్మిలను కాంగ్రెస్ కండువాతో పార్టీలోకి ఆహ్వానించారు.

తర్వాత షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ మెడలో కూడా పార్టీ కండువా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి ఆయన ఒప్పుకోలేదు. తాను మాత్రమే పార్టీలో చేరుతున్నానని ఖర్గేతో షర్మిల చెప్పినట్టుగా వీడియోలో కనబడుతోంది.
తర్వాత ఆ కండువాను రాహుల్ గాంధీ.. షర్మిలకు వేసి పార్టీలోకి స్వాగతించారు.

బ్రదర్ అనిల్ కుమార్ క్రైస్తవ ప్రచారకుడిగా పనిచేస్తున్నారు. మొదటి నుంచి ఆయన తెరవెనుకే ఉంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎపుడూ లేరు.

వైఎస్ షర్మిలకు అండగా ఉంటూ రాజకీయాల్లో ఆమెను ప్రోత్సహించారు. తాజాగా షర్మిలతో పాటు ఆయన ఢిల్లీ వెళ్లారు. భార్యతో పాటు అనిల్ కుమార్ కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారని భావించి ఆయనకు ఖర్గే కండువా వేయబోయారు.
అయితే తాను పార్టీలో చేరడం లేదని ఖర్గేతో అనిల్ చెప్పారు.

You cannot copy content of this page

Scroll to Top