అల్లు అర్జున్ వెనుక ఓ శక్తి ఉంది.. అడ్వకేట్ సంచలన కామెంట్స్..
Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 24: అల్లు అర్జున్ కేసు విషయంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ప్రెస్‌మీట్ పెట్టి మరీ.. ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. హీరో అల్లు అర్జున్ వెను ఓ మహా శక్తి ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే అల్లు అర్జున్ కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే గాక.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సమసిపోయిందనుకున్న వ్యవహారం.. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించడం, ఆ వెంటనే అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టడంతో మరింత రచ్చ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం నాడు చిక్కడపల్లి పోలీసులు.. హీరో అల్లు అర్జున్‌ను పీఎస్‌కు పిలిచి మరీ విచారించారు.
విచారణ ముగిసిన తరువాత.. అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ తీవ్ర ఆరోపణలు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్‌ను కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. పుష్ప సినిమాలో చేసినట్లుగా రేవంత్ రెడ్డి సర్కార్‌ను కుప్ప కూల్చాలని చూస్తున్నట్లు తెలిపారు. గడిచిన 24 గంటలుగా పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. అల్లు అర్జున వెనుక ఓ శక్తి ఉందన్నారు. రేపటి నుంచి వారం రోజుల్లో రేవంత్ సర్కార్‌ను కూల్చడానికి పెద్ద ప్లాన్ వేశారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఈ వారం రోజుల్లోనే బీఆర్ఎస్, బీజేపీలు తాము అనుకున్న పనిని చేయాలనుకుంటున్నాయని ఆరోపిపంచారాయన. అల్లు అరవింద్ ఫ్యామిలీని కాపాడటానికి ప్రతిపక్షాలు ఉన్నాయని.. పక్క రాష్ట్రాల నుంచి సైతం అల్లు అర్జున్‌కు మద్దతిస్తున్నారని చెప్పుకొచ్చారు. కానీ, బాధిత కుటుంబానికి అండగా నిలబడాల్సింది తెలంగాణ సమాజమేనని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. వీరికి అండగా నిలిచిన వారే నిజమైన తెలంగాణ వాదులు అని పేర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీ పక్షాన నిలబడిన వారు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారంటూ అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు తనపై ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొంటానని ప్రకటించారాయన.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App