TRINETHRAM NEWS

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను మంత్రి పదవి తొలగించాలి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు,పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి,పార్లమెంట్ సమావేశంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై అనుచితవాక్యాలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను మంత్రి పదవి నుంచితొలగించాలని డిమాండ్ చేస్తూ ఎఐ సిసి అధ్యక్షులుమల్లికార్జున్ ఖరియ మరియు లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాలతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పరిగి డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు.VKB పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి,అనంతరం కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి భారత జాతినిఅవమానపరిచే విధంగా అమిత్ షా వ్యాఖ్యలు చేశారు.భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర వహించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వారి గురించి చులకన చేసి మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం… నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు తోడు దొంగలు, మోడీ అమిత్ షా కలిసి దేశ రాజ్యాంగాన్ని మార్చాలనికుట్రలుచేస్తున్నారు.దానిలో భాగంగానే అంబేద్కర్ ను ఈ విధంగా చులకన చేసిమాట్లాడుతున్నారు.ఈ నిరసన కార్యక్రమం కేవలం ప్రారంభంమాత్రమే ఇంక ముందు ముందు చాలా నిరసనకార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.కలెక్టర్ కు వినతిపత్రం అందించి దేశవ్యాప్తంగా ఉన్న డిసిసిల ద్వారా వినతి పత్రాలను కలెక్టర్ల ద్వారా భారత రాష్ట్రపతికి అమిత్ షా ని మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలి అని డిమాండ్ చేస్తున్నామని అని ఎమ్మెల్యే TRR తెలిపారు.ఈ కార్యక్రమంలో వికారాబాద్ పట్టణఅధ్యక్షులు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీ.అర్ధ.సుధాకర్ రెడ్డి , జిల్లా గ్రంథాలయ చైర్మన్ శ్రీ శేరి.రాజేష్ రెడ్డి , వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి.మంజుల రమేష్ ,సీనియర్ నాయకులు,మండలపార్టీ,అధ్యక్షులు,మార్కెట్ చైర్మన్ లు,కౌన్సిలర్లు,నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App