WhatsApp Image 2024 12 24 at 17.50.40
క్రిస్టియన్ మత అభ్యున్నతి కి ప్రభుత్వం తోడ్పడుతుంది..
ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని డీసెంట్ ఫంక్షన్ హల్ మంగళవారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో స్థానిక నాయకులతో కలిసి పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులకు ముందస్తు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
ముందుగా క్రిస్టియన్ సోదరులు ఎమ్మెల్యే విజయరమణ రావు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ
క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని. క్రిస్టియన్ సోదరుల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని తెలిపారు. పెద్దపల్లి ప్రాంతంలో ఉన్న చర్చిల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు ప్రత్యేకంగా తీసుకుంటామని ఎమ్మెల్యే విజయరమణ రావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మత పెద్దలు, ఫాస్టర్స్, క్రైస్తవ సోదర సోదరీమణులు, పెద్దపల్లి మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు మరియు పట్టణ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
