జూన్ 27, 2026

WhatsApp Image 2024 12 21 at 3.56.56 PM

TRINETHRAM NEWS

గొర్ల కాపరిని ప్రభుత్వం ఆదుకోవాలి

పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జూలపల్లి మండలంలోని చీమల పేట గ్రామానికి చెందిన కురుమ సోదరుడు తొంటి ఎల్లయ్య 15 గొర్రెలు మరియు మేకలు శుక్రవారం రోజున అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు విద్యుతాఘాతానికి గురై మరణించి గొర్ల కాపరి తీవ్ర ఆవేదన చెందుతుండగా విషయం తెలుసుకున్న రఘువీర్ సింగ్ వారి వద్దకు వెళ్లి చనిపోయిన గొర్రెలు మేకలను పరిశీలించడం జరిగింది. తదనంతరం రఘువీర్ సింగ్ ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు సేకరించి మాట్లాడుతూ సోదరుడు ఎల్లయ్య గొర్రెలు మేకలు చనిపోవడం చాలా బాధాకరమని, విచారం వ్యక్తం చేసి గొర్ల కాపరికి ధైర్యం చెబుతూ, కాయా కష్టం చేస్తూ పొట్టగడుపుకునే గొర్ల కాపరికి ఈ విధంగా అకస్మాత్తుగా దాదాపుగా 15 గొర్రెలు, మేకలు చనిపోవడం చాలా బాధాకరమని తెలియజేస్తూ, ప్రభుత్వం స్పందించి అతని కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వెంటనే ఆదుకొని వారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ అతనికి ధైర్యం చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి వారికి నష్టపరిహారం అందించి వారిని ఆదుకోవాలని అన్నారు

ఈ కార్యక్రమంలో నాయకులు లంక తిరుపతి, తొంటి రాజేశం, రాణవేణి సంపత్, కల్వల రాజేశం, లంక భూమయ్య, తొంటి బీరయ్య, తొంటి మల్లేశం, మొగుల్ల ఐలయ్య, పుల్ల రాకేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page