విద్యార్థులు శాస్త్రీయదృక్పథాన్ని అలవరచుకోవాలి

TRINETHRAM NEWS

విద్యార్థులు శాస్త్రీయదృక్పథాన్ని అలవరచుకోవాలి

Trinethram News : బోడుప్పల్ మున్సిపాలిటీ పరిదిలోని చెంగిచర్ల మండల పరిషత్ ఉన్నత పాఠశాలలోతేది17.12.2024 మంగళ వారం రోజున ఏర్పాటు చేసిన సైన్స్ ప్రదర్శన సమావేశంలో జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కో ఆర్డినేటర్ ,ప్రేరణ బాలల వేదిక అధ్యక్షులు డాక్టర్ అక్కెనపల్లి లక్ష్మణాచారి మేడిపల్లి మండల విద్యాధికారి జి. శ్రీనివాస్ రెడ్డిగారలు అతిథులు గా పాల్గొని విద్యార్థులు చిన్నప్పటి నుండి శాస్ర్తీయ ఆలోచనలను పెంపొందించుకోవాలని, ఇవి వారి సృజనాత్మకతకు అద్దంపడుతాయన్నారు విద్యార్థులు తయారు చేసిన వివిధ ప్రాజెక్టులను ఉపాద్యాయులు, తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించారు.

అందులో సోలార్ ఎనర్జీ,న్యూటన్ గమన సూత్రం, భూకంప తీవ్రతఆలర్ట్, గుండె పనితీరు,అర్థపత్ర ప్రయోగము ,జీర్ణవ్యవస్థ, ఊపిరితిత్తుల తో పాటు పర్యావరణానికి సంబందించిన పలు నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి.పాఠశాల ఉపాధ్యాయురాలు కె సునీత చొరవతో విద్యార్థులు ప్రాజెక్టులను నిర్వహించగా అందులో ఉత్తమ ప్రతిభ కనబరచిన వారికి జన్య ఫౌండేషన్ ప్రతినిధులు మెడల్స్ అందజేశారు.స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. యాదయ్య మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా జన్య ఫౌండేషన్ సౌజన్యంతో పాఠశాలకు అభ్యసన సామగ్రి అందించడం అభినందనీయమన్నారు. ఫార్మేటివ్ పరీక్షల్లో జీవ శాస్త్ర మందు మెరిట్ మార్కులు సాధించిన పదవ తరగతి విద్యార్థులు నిఖిత, శివతారలకు ఉపాద్యాయులు పుస్తకాలను బహుమతులు గా అందించారు. ఈ కార్యక్రమంలో జన్య ఫౌండేషన్ కోఆర్డినేటర్ రమణ మాజీ MEO బలరాం, ఉపాద్యాయులు పి.గణేష్,కె సునీత బి.శకుంతల,ఎస్ భూపాలరెడ్డి, సరిత,యమున,మంజుల, లావణ్య ,పావని ,జ్యోతి,అరుణ ,భావన తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top