TRINETHRAM NEWS

శుభవార్త.. ధర్నా విరమించిన ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు..

దేశంలోని పెట్రోల్ బంకుల్లో భారీగా రద్దీ పెరిగింది. ఆయిల్ ట్యాంకర్ యజమానులు స్ట్రైక్ చేయడంతో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిండుకున్నాయి.

ఆయిల్ ట్యాంకర్ యజమానులు ధర్నా చేస్తున్న విషయం వాహనాదారులు భారీగా పెట్రోల్ బంకులకు చేరుకున్నారు. దీంతో పెట్రోల్ బంకుల్లో భారీగా రద్దీ పెరిగింది. ప్రభుత్వం ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లతో చర్చలు జరిపింది. దీంతో ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నా విరమించారు.

దీంతో పెట్రోల్‌, డీజిల్‌ లోడులతో చర్లపల్లిలోని డిపోల నుంచి ట్యాంకర్లు బంకులకు వెళ్తున్నాయి. ఇవి బంకులకు చేరేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో కొద్దిసేపు అక్కడ వాహనదారుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇవాళ ఉదయం నుంచి బంకుల వద్ద వాహనదారులు ఇంధనం కోసం బారులు తీరిన సంగతి తెలిసిందే. భారత న్యాయ సంహిత చట్టంలో హిట్‌ అండ్‌ రన్‌ కేసులకు సంబంధించి జైలు శిక్షను ఇటీవల కేంద్రం భారీగా పెంచింది.

హిట్ అండ్ రన్ కేసులో రూ.10 లక్షల ఫైన్ తో పాటు గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్షను పెంచుతూ చట్టం చేసింది. దీనికి నిరసనగా ఆయిల్‌ ట్యాంకర్ల ఓనర్లు, డ్రైవర్లు సోమవారం(జనవరి 1) నుంచి ధర్నాకు దిగారు. దీంతో హైదరాబాద్‌లోని పెట్రోల్‌ బంకులకు ఇంధన సరఫరా నిలిచిపోయిన సంగతి తెలింది. దీంతో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. దీంతో చాలా చోట్ల నో స్టాక్ బోర్డు పెట్టారు.

మంగళవారం సాయంత్రం ఆయిల్‌ ట్యాంకర్లు ధర్నా విరమించినట్లు ప్రకటన చేయడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ వీరి ధర్నా వారం పాటు జరిగింటే తీవ్ర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వచ్చేది.