జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 02 at 6.21.24 PM

TRINETHRAM NEWS

మేడారం జాతరకు జీరో టికెట్ లేనట్లేనా?

వరంగల్ జిల్లా: జనవరి 02
తెలంగాణ రాష్ట్రంలోని మేడారం మహా జాతరకు ఆర్టీసీ ప్రయాణికులకు చార్జీల మోత మోగనున్నది. సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా పూర్తిగా స్పెషల్‌ బస్సులనే నడుపాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికా రులను ఆదేశించినట్టు తెలిసింది.

తద్వారా మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయా ణాన్ని దూరం చేసేందుకు వ్యూహం రచించింది.

జనవరిలో సంక్రాంతి పండుగ, ఫిబ్రవరిలో సమ్మక్క-సారలమ్మ జాతల నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో లక్షలాది మంది మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఉన్నది.

అదే జరిగితే నష్టం తప్పదనే ఆలోచనతో ప్రభుత్వం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో ప్రత్యేక బస్సులను నడిపించి చార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీని ఆదేశిం చినట్టు తెలుస్తున్నది.

మహాలక్ష్మి పథకం అమలులో టీఎస్‌ఆర్టీసీ అధికారులకు రోజుకో కొత్త అనుభవం ఎదురవుతు న్నది. బస్సుల్లో ఉచిత ప్రయాణం కార్యక్రమం అమలుకు ముందు నిత్యం రూ.11 కోట్ల నుంచి రూ. 18 కోట్ల ఆదాయం వచ్చేది.

ప్రస్తుతం బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంతో ఆక్యుపెన్సీ పెరిగినా, ఆదాయం భారీగా పడిపోయింది.

You cannot copy content of this page