Collector Koya Harsha : డిసెంబర్ 14న కామన్ డైట్ లాంచ్ కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ కోయ హర్ష

TRINETHRAM NEWS

డిసెంబర్ 14న కామన్ డైట్ లాంచ్ కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*పిల్లల తల్లిదండ్రులను కామన్ డైట్ లాంచ్ కార్యక్రమానికి ఆహ్వానించాలి

పౌష్టికరమైన రుచికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలి

*కామన్ డైట్ మెనూ అమలు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, డిసెంబర్-12: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

డిసెంబర్ 14న కామన్ డైట్ లాంచ్ కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.

గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవి , మాడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలల్లో కామన్ డైట్ మెనూ అమలు పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, డిసెంబర్ 14న ప్రభుత్వ ఆదేశాల మేరకు కామన్ మెనూ కార్యక్రమం లంచ్ ఉంటుందని, విద్యార్థులకు కామన్ డైట్ ప్లాన్ డిసెంబర్ 14 నుంచి అమలులోకి వస్తుందని అన్నారు. కామన్ డైట్ ప్లాన్ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, పిల్లల తల్లిదండ్రులను ఆహ్వానించి లాంచ్ కార్యక్రమం చేయాలని కలెక్టర్ సూచించారు.

హాస్టల్స్ లో కామన్ డైట్ వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి హాస్టల్ లో ఒకే రకమైన ఆహారం విద్యార్థులకు అందించడం జరుగుతుందని అన్నారు. కిచెన్ & డైనింగ్ ఎరియా నిర్వహణ మెరుగు పరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

డిసెంబర్ 14న ఉదయం 11 గంటలకు విఐపి రెసిడెన్షియల్ పాఠశాలలకు చేరుకుంటారని, 11 నుంచి 12 గంటల వరకు పాఠశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని, 12 నుంచి 12.30 గంటల వరకు పిల్లలతో ఇంటరాక్షన్, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. అనంతరం కామన్ డైట్ ప్లాన్ సంబంధించిన బ్యానర్ ముఖ్య అతిథి చే ఆవిష్కరించి ప్రసంగిస్తారని, అనంతరం 1 గంటలకు ముఖ్య అతిథి, పిల్లలు పిల్లలు తల్లి దండ్రులతో పాటు భోజనం చేస్తారని కలెక్టర్ తెలిపారు.

శనివారం నాడు కామన్ డైట్ లాంచ్ కార్యక్రమం ఉన్నందున ఆరోజు నాన్ వెజ్ ఆదివారం మెనూ తయారు చేయాలని కలెక్టర్ సూచించారు. గతంలో ఉన్న డైట్ చార్జీలు 8 సంవత్సరాల తర్వాత 40 శాతం ప్రస్తుత ప్రభుత్వం పెంచిందని, కాస్మెటిక్ చార్జీలను 16 సంవత్సరాల తర్వాత 200 శాతం పెంచినట్లు, పాఠశాలలో చదివి విద్యార్థుల ఎదుగుదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అత్యంత శ్రద్ధ వహిస్తుందని అన్నారు.

యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం గురించి తల్లిదండ్రులకు కామన్ డైట్ లంచ్ సందర్భంగా తేలియజేయాలని అన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఒకే డైట్ ప్లాన్ అమలు అవుతుందని, పిల్లలకు పౌష్టికరమైన రుచికరమైన ఆహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

పాఠశాలలకు సరుకులు ఏ విధంగా వస్తున్నాయి కిచెన్ లో ఏ విధంగా భద్రపరచాలి, విద్యార్థులకు రుచికరమైన ఆహారం తీసుకోవాల్సిన చర్యలు అంశాల పై సిబ్బందికి అవసరమైన శిక్షణ అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.

కిచెన్, డైనింగ్ ఏరియా లను శుభ్రం చేయాలని, ఆ ప్రాంతాలను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జే రంగారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top