IMG 20241209 WA0041
ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జరిగిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వచ్చి అందించిన ప్రజా వినతులు, ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ లింగ్యా నాయక్, అదనపు కలెక్టర్ స్తానికసమస్యలుసుదీర్, గార్లతో కలిసిస్వీకరించారు.
ప్రజావాణిలో మొత్తం 118 దరఖాస్తులు రాగా, భూ సమస్యలు, ఇతర సమస్యల కు సంబంధించి ధరఖాస్తులు వచ్చాయని, స్వీకరించిన వాటిలో కొన్నింటిని సత్వరమే పరిష్కరించారు. వివిధ శాఖలకు చెందిన అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించిపరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ జిల్లాలో వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికార్యక్రమంలో ప్రజలు చేసుకున్నదరఖాస్తులనుసాధ్యమైనంత త్వరగా పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో వారికి తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ వాసు చంద్ర , జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
