జూన్ 27, 2026

WhatsApp Image 2024 12 04 at 15.30.05

TRINETHRAM NEWS

ఆశాలకు ఫిక్స్డ్ వేతనం రూ 18,000/- చెల్లించాలి ఆశా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి

లెప్రసీ, పల్స్ పోలియో, టిబి బకాయిలు చెల్లించాలి

సామాజిక భద్రత కల్పిస్తూ నెలకు 10 వేల రూపాయలు పెన్షన్ గా చెల్లించాలి

ఆశాలను కార్మికులుగా గుర్తించి కార్మిక చట్ట పరిధిలోకి తేవాలి

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

వరంగల్ జిల్లా కలెక్టరు కార్యాలయం ముందు చినగారి రాణి అధ్యక్షతన ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ధర్నాను ఉద్దేశించి ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాసు మాధవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఈఎస్ఐ,పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, లెప్రసి, పల్స్ పోలియో, టిబి బకాయి పారితోషికాలు వెంటనే చెల్లించాలని ఇతర సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మాధవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, వీరు మాతా శిశు మరణాల రేటు తగ్గించడంలో, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలియచేశారు. గ్రామీణ స్థాయిలో ప్రజలకు ఆరోగ్య వ్యవస్థకు మధ్య వారధిగా పని చేస్తున్నారని అయినా ప్రభుత్వం వీరి సమస్యలను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్షించారు. ఆశాలు కోరుతున్నది గొంతెమ్మ కోర్కెలు కాదని, వీరికి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చేముందు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈ.ఎస్.ఐ,పీ.ఎఫ్.సౌకర్యం కల్పించాలని హామీ ఇచ్చారని వెంటనే ఆ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆశాల రిప్రజెంటేషన్ కలెక్టర్ ఇవ్వడం జరిగింది. పై సమస్యలపై కలెక్టర్ స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి ఆశల సమస్యలను తీసుకెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అద్యక్ష, కార్యదర్శులు మాలోతు సాగర్, ముక్కెర రామస్వామి, ఆశా జిల్లా కార్యదర్శి చైతన్య నాయకులు కళ్యాణి, సుజాత, రజిని, కవిత, మల్లీశ్వరి, రమ, మాధవి, మంజుల, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page