జనసేన విజయ యాత్ర – AP NEEDS PAWAN KALYAN – Day 31

TRINETHRAM NEWS

జనసేన విజయ యాత్ర – AP NEEDS PAWAN KALYAN – Day 31

31 వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన ఇంఛార్జి వినుత కోటా ఇంటింటికీ ప్రచారం

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు శ్రీకాళహస్తి నియోజకవర్గం, తొట్టంబేడు మండలం, బసవయ్య పాలెం ఎస్సీ కాలనీ లో ఈ రోజు ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదు సుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి,అక్రమాలను , దోపిడీలను వివరించడం జరిగింది.

రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ది కి సహకరించాలని కోరడం జరిగింది.
తప్పకుండా మార్పు రావాలి, మార్పు కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్నామని, రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోరుకుంటున్నాం అని ఎస్సీ కాలనీ మహిళలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి పేట చంద్ర శేఖర్, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్ , నాయకులు గణేష్ ,రవి కుమార్ రెడ్డి , నాథముని , లక్ష్మి , రాజ్య లక్ష్మి , కవిత , శారద , మునయ్య , సురేష్ , రాజేష్ , జనసైనికులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.

//
ఇట్లు
జనసేన పార్టీ కార్యాలయం
శ్రీకాళహస్తి నియోజకవర్గం

You cannot copy content of this page

Scroll to Top