జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 27 at 16.25.38

TRINETHRAM NEWS

కూటమి నేతల మధ్య ఫ్లైయాష్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్‌

Trinethram News : అమరావతి : వైఎస్‌ఆర్‌ జిల్లా ఆర్టీపీపీ (రాయలసీమ థర్మల్‌ పవర్‌ప్లాంట్‌)(RTPP) ఫ్లైయాష్‌ వివాదం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. కూటమి నేతలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు..

తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, భాజపా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంవో, జిల్లా అధికారులతో చంద్రబాబు మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

ఈ వివాదం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్య సృష్టించేలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. శాంతిభద్రతల విషయంలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని.. కఠినంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. మొత్తం ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page