TRINETHRAM NEWS

మోడీ,విధానాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలంతా ఉద్యమించాలి
రైతు,కార్మిక నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని చౌరస్తా కేంద్రంలో జిల్లా కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలోజరిగింది.
ఈ నిరసన కార్యక్రమంలో CITU పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి,TUCI రాష్ట్ర నాయకులు తోకల రమేష్, IFTU పెద్దపెల్లి జిల్లా*కార్యదర్శి దాముక లచ్చన్న IFTU రాష్ట్ర నాయకులు ఈసంపల్లి రాజేందర్
పాల్గొని మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలన్నారు.
రైతు చట్టాలను రద్దు చేస్తానని హామీ ఇచ్చిన ప్రధానమంత్రి మోడీ వాటిని అమలుకు పూనుకున్నాడని అన్నారు.
దీనికి వ్యతిరేకంగా రైతులు కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు గుండెగా ఉన్న సింగరేణి బొగ్గు బ్లాక్ లను బహుళ జాతి సంస్థలకు వేలం ద్వారా అమ్మేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నారు.
భారతదేశంలో 32 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉన్నది అందులో 100 రకాల వ్యవసాయ ఉత్పత్తులను పండిస్తున్నారు. వీటికి సంబంధించిన కనీసం మద్దతు ధర గిట్టుబాటు ధర లేదు అనేక ఉద్యమాల పోరాట ఫలితంగా వచ్చిన స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసు సాపేక్షంగా రైతు అనుకూల సిఫారసుగా ఉన్నాయి, వాటిని సైతం పాలకులు బుట్టదాకలు చేశారన్నారు.
రాష్ట్రంలోకాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న తాను ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులు వేతనాల పెంపు లేక అనేక ఇబ్బందులుఎదుర్కొంటున్నరు. నిరుపేదలు ఇళ్ల స్థలాలు లేక ఇంటి అద్దెలు కట్టలేక ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నరు. ఈ స్థితిలో దేశ ప్రజలంతా ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉన్నది. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ నిరసన కార్యక్రమంలో కార్మిక సంఘాల ప్రజా సంఘాల నేతలు తీష్, రాజయ్య, కలవల రాయమల్లు జూపాక రామచందర్ రాము, సమీర్, బాలకృష్ణ, తిరుపతి, శ్రీనివాస్,గణేష్, నరేష్, శివ, దీప, వరలక్ష్మి, రాజయ్యఅంజలి, రజియా, రమ మహేశ్వరి,వాణి,రజిత,భాగ్య లక్ష్మి,నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App