WhatsApp Image 2024 11 26 at 2.00.56 PM
నిద్రిస్తున్న వారిపై నుంచి దూసుకెళ్లిన లారీ.. ఐదుగురు మృతి
Trinethram News : కేరళ : Nov 26, 2024,
కేరళ త్రిస్సూర్ జిల్లా నాట్టిక వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కలప లోడుతో వెళ్తున్న లారీ జాతీయ రహదారి పక్కన నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ప్రమాద ఘటన తర్వాత డ్రైవర్ ఆపకుండా దూసుకుపోయేందుకు ప్రయత్నించగా, స్థానికులు అతన్ని పట్టుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో లారీని నడిపినట్లు పోలీసులు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
