జల్సాల కోసం దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన గోదావరిఖని వన్ టౌన్ పోలీస్….
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
దొంగతనం చేసిన వ్యక్తి
ఐత వెంకటేష్ తండ్రి నరసయ్య 27 సంవత్సరాలు,Occ: కార్ డ్రైవర్ r/o రమేష్ నగర్..
పట్టుకున్న వస్తువులు…
1) 2 బ్రాస్లెట్స్ (బంగారం)
2) జత పట్టీలు (వెండి)
3)రెండు జతలు కడియాలు(వెండి)
4) రెండు వెండి గొలుసులు(వెండి)
నేరంచే విధానం
నేరస్తుడు వెంకటేష్ గోదారిఖని ఏరియాలో అవసరం ఉన్నవారికి కారు నడుపుకుంటూ వచ్చిన డబ్బులతో జల్సా లు చేస్తూ త్రాగుడుకు అలవాటు పడి డబ్బుల కోసం ఇతరుల దగ్గర అప్పులు చేస్తూ ఉంటాడు అట్టి అప్పులు తీర్చడం కోసం దొంగతనాలు చేస్తూ ఉంటాడు. కారు నడుపుతున్న సందర్భంలో మధ్యాహ్నం వేళల్లో తాళం వేసి విన్న ఇండ్లను గమనిస్తూ రాత్రి సమయాల్లో అట్టి తాళం వేసిన ఇంట్లో కి చొరబడి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, పైసలు, ఇతర వస్తువులు ఎత్తుకెళ్లి అమ్ముకొని వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఉంటాడు. ఇదే మాదిరిగా తేదీ 14.11.2024 రోజున ద్వారకా నగర్ కు చెందిన చిలకలపల్లి రమేష్ తండ్రి .వీరయ్య occ.సింగరేణి ఉద్యోగి, ఇంటిలో వారు ఇంటికి తాళం వేసి పెళ్లికి పోయిన సందర్భంలో ఐత వెంకటేష్ అనే దొంగ ఇంట్లోకి చొరబడి బీరువాలు పగలగొట్టి బీరువాలలో ఉన్న నాలుగు తులాల బంగారు ఆభరణాలు 30 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లి తాకట్టు పెట్టి, తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తూ ఉండగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వెంకటేష్ దొంగతనం చేసినట్టుగా నిర్ధారణ చేసుకొని పట్టుకోవడం జరిగింది. వెంకటేష్ దగ్గర నుండి దొంగిలించిన బంగారు ఆభరణాలను మరియు వెండి ఆభరణాలను రికవరీ చేయడం జరిగింది అతనిని జైలుకు పంపడం జరిగింది అట్టి ఆభరణాలను కోర్టు ద్వారా బాధితుడికి అందజేయడం జరుగుతుంది.
ఇట్టి కేసును చేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై భూమేష్ , కానిస్టేబుల్ క్రైమ్ టీమ్ శ్రీనివాస్, వెంకటేష్ లను అభినందించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App