కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బొగ్గు గనుల వేలాన్ని రద్దు చేయాలి-CPM
అ. ముత్యంరావు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ అర్జీ1, బ్రాంచి కమిటీ సమావేశం
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని శ్రామిక భవన్లో అరేపల్లి రాజమౌళి అధ్యక్షతన జరిగింది, ముఖ్య అతిథిగా హాజరైన ఎర్రవల్లి ముత్యంరావు మాట్లాడుతూ, కేంద్ర లోని బిజెపి ప్రభుత్వం బొగ్గు గనుల వెలన్ని ప్రారంభించి గుత్తా పెట్టుబడి దారులకు అమ్మకాలను ప్రారంభించిందని, పకృతి సహజ సంపద అయిన భారతదేశ బొగ్గు గనులతో పాటు తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనులు కూడా వేలం వేస్తూ నిరుద్యోగ సమస్యను సృష్టిస్తుందని తెలియజేశారు, తెలంగాణలోని బొగ్గు గనులను సింగరేణి కేటాయించకుంటే భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలు దెబ్బతీసే ప్రమాదం ఉందని తెలిపారు, తెలంగాణలోని బొగ్గులను సింగరేణి కేటాయించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ బస్సు యాత్ర నిర్వహించిందని, ప్రభుత్వ రంగ పరిశ్రమల రక్షణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తుందని తెలిపారు, ఈ నేపథ్యంలో సిపిఎం ఆల్ ఇండియా మహాసభలతో పాటు రాష్ట్రాల మహాసభలు జిల్లాల మహాసభలు నిర్వహిస్తున్నారని మన పెద్దపల్లి జిల్లా మహాసభలు ఎన్టిపిసి రామగుండం ఏరియాలో 2024 నవంబర్ 23, 24 తేదీలలో జరగబోతున్నాయని, 23న మేడిపల్లి సెంటర్లో పెద్ద ఎత్తున ర్యాలీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ముఖ్య అతిథులుగా తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఎస్. వీరయ్య జ్యోతి భూపాల్ పాల్గొంటారని, కార్మిక వర్గ పక్షపాతిగా పోరాటాలు చేస్తున్న సిపిఎం పార్టీకి కార్మికులుగా అండదండలు ఇవ్వడంతో పాటు ఈ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు,
ఈ కార్యక్రమంలో బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మండే శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు తోట నరహరి రావు, ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, రాజేశ్వర చారి, నంది నారాయణ, శివరాం రెడ్డి, దుర్గాప్రసాద్, ఈద వెంకటేశ్వర్లు, ఎస్ శ్రీనివాస్, పోలేటి నరేష్, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App