జూన్ 26, 2026

IMG 20241115 WA0038

TRINETHRAM NEWS

గ్రూప్ 3 పరీక్షలకు పటిస్తా బందోబస్తు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్

జిల్లాలో గ్రూప్ –III పరీక్షల సంధార్బంగా పటిష్టమైన బందోబస్త్ . – జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి,IPS.*
జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలుజిల్లా లో ఈ నెల 17, 18వ తేదీలలో జరుగనున్న గ్రూప్-3 పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా బందోబస్త్ ఏర్పాట్లు చేయడం జరిగింది అని జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి,IPS తెలియజేయడం జరిగింది. అందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయడం జరిగింది.గ్రూప్-III సర్వీసెస్ పరీక్షల కోసం జిల్లాలో 31 పరీక్షా కేంద్రాలు నామినేట్చేయబడ్డాయి. 1) వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14, 2) తాండూరు టౌన్ పరిధిలో 11 పోలీస్ స్టేషన్ 3) పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో 05 మరియు 4) చెంగోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 01 ఉన్నాయి.ఈ నేపథ్యంలో 1) వికారాబాద్ పీఎస్, 2) పరిగి, 3) చెంగోముల్, 4) తాండూరు టౌన్ పీఎస్‌లలో పటిష్టమైన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుంది. కావున పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడ గుమికుడి ఉండవద్దు. జిరాక్స్ సెంటర్, ఇతర దుకాణాలు మూసి ఉంచాలి. ప్రశ్నపత్రాల లీకేజీలు, మాల్ ప్రాక్టీస్ వంటి వాటికి ఆస్కారం లేకుండా , పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవడం జరిగింది అని ఎస్పీ తెలిపినారు. మొత్తం జిల్లాలో 118 మంది పోలీస్ అధికారులతో భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో 2 సి‌ఐ అదికారులు, 11 మంది ఎస్‌ఐ అధికారులు, 29 మంది ఏ‌ఎస్‌ఐ/హెచ్‌సి అధికారులు, 76 మంది పోలీస్ కానిస్టేబుల్ అధికారులు ఇట్టి బందోబస్త్ లో పాల్గొంటారు అని ఎస్పీ గారు తెలిపినారు.
గ్రూప్-III సర్వీసెస్ పరీక్షలు రాసే అభ్యర్థులు పరీక్షలకు సంబంధించిననియమ,నిబంధనలు పాటించి అధికారులకు సహకరించాలని, పరీక్ష కేంద్రాలకు చేరుకొనేసమయంలోఅభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లు అయితే ఆయా పరిధిలోని పోలీస్ అధికారులకు గాని, డైల్ 100 కు గాని సంప్రదించాలని ఎస్పీ తెలియజేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page