WhatsApp Image 2024 11 15 at 18.39.17
ఏపీలో త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ: మంత్రి అచ్చెన్న
Trinethram News : Andhra Pradesh : ఏపీలో వర్షాభావం వల్ల పలు జిల్లాల్లో 1.06లక్షల హెక్టార్లలో పంట నాశనం అయిందని మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో తెలిపారు.
ఇప్పటికే 54 కరవుమండలాలను ప్రకటించామని అన్నారు.1.44 లక్షల మంది రైతులు నష్టపోయారని చెప్పారు.
ఇందుకు గానూ నష్ట పరిహారంగా రూ.159.2 కోట్లను మంజూరు చేసినట్లు
వెల్లడించారు.
త్వరలోనే రైతుల ఖాతాల్లో ఆ మొత్తాన్ని జమ చేస్తామని ప్రకటించారు.
నష్టపోయిన వారికి రాయితీతో 47వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేశామన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
