జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 15 at 18.11.40

TRINETHRAM NEWS

కారు బైక్ ఢీకొని వ్యక్తి మృతి ఇంకొకరికి గాయాలు

చొప్పదండి : త్రినేత్రం న్యూస్

వివరాల్లోకి వెళితే బోయిన్పల్లి మండలం మర్లపేటకు చెందిన తూము వంశీకృష్ణ సన్ ఆఫ్ రాజయ్య మరియు జంగపల్లి విజయ్ సన్నాఫ్ శంకరయ్య అను వ్యక్తులు మరల పేట నుంచి కొలిమిగుంటలోని బంధువుల ఇంటికి tg23 0832 అను బండిమీద వస్తుండగా గుమ్లాపూర్ చొప్పదండి శివారులో చొప్పదండి నుంచి రామడుగు వెళుతున్న ఏపీ 35 జె2646 అను నంబర్ గల కార్ ను దాసరి రమేష్ సన్నాఫ్ హనుమయ్య గోపాలరావుపేట రామడుగు మండలం అను వ్యక్తి అతివేగంగా అజాగ్రత్తగా తన కార్ని రాంగ్ రూట్లో నడుపుకుంటూ వచ్చి వంశీ నడుస్తున్న బైకుకి టక్కరు ఇవ్వగా బైక్ మీద వెనకాల కూర్చున్న విజయ్ వేగానికి ఎగిరి కార్ మీద పడి కింద పడిపోయినాడు సంఘటన స్థలంలోని ప్రాణాలు కోల్పోయాడు బైకు డ్రైవ్ చేస్తున్న వంశీకృష్ణ కి దెబ్బలు తగిలినవి. మృతుడు విజయ్ తండ్రి శంకరయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాసరి రమేష్ పైన కేసు నమోదు చేయడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page