WhatsApp Image 2024 11 14 at 7.16.17 PM
పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ ఎన్పీసీఐ లింక్ చేయించుకోవాలి. – సాగిన బుజ్జిబాబు.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) అల్లూరిజిల్లా ఇంచార్జ్ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ (NPCI) లింక్ చేయించుకోవాలి. బ్యాంక్ అకౌంట్ లేనివారు పోస్ట్ ఆఫీస్ లో త్వరగా అకౌంట్ ఓపెనింగ్ చేసుకుంటే NPCI లింక్ చేస్తున్నారు.
ఆధార్ (NPCI) లింక్ అనేది బ్యాంకుల్లో మరియు మీ గ్రామ పరిధిలో, ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో చేస్తున్నారు. కనుక NPCI లింక్ చేసుకోవాలి అని మనవి చేస్తున్నాను.
ప్రభుత్వ పథకాలకు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ కి రూ.1500 అమ్మకు వందనం, రైతు భరోసా, ఇతర పథకాలు కి ఉచిత గ్యాస్ కు మీ కుట్టుంబానికి వర్తించే ఇతర పథకాలకు, బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ NPCI లింకు తప్పనిసరిగా ఉండాలి అని కొయ్యూరు జనసేన మండల కమిటీ మండల బూత్ చైర్మన్ సాగిన బుజ్జిబాబు అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
