జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 11 at 18.37.26

TRINETHRAM NEWS

రామగుండం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల సౌకర్యార్థమై బెస్ట్ రన్నర్స్ అసోసియేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు

ఇందులో భాగంగా సుమారు రెండు లక్షల రూపాయల విలువైనటువంటి సేవలను అందించారు.

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని తరగతి గదులకు గ్రిల్స్ ఏర్పాటు చేయడంతో పాటు పాఠశాలకు ప్రింటర్ మరియు సౌండ్ సిస్టం ను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముందు ఇటీవల ప్రమాదానికి గురై కాలు కోల్పోయినటువంటి గోదావరిఖని ప్రాంతానికి చెందిన రంజిత్ కు 40 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కోలేటి దామోదర్ చేతుల మీదుగా అందజేశారు
ఇంకా ఈ కార్యక్రమంలో బెస్ట్ రన్నర్స్ అసోసియేషన్ నిర్వాహకులు కోలేటి సతీష్, శంకర్, సదానందం, నాగరాజు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శారద ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది మరియు కోలేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page