జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 10 at 15.25.35

TRINETHRAM NEWS

“రాష్ట్ర గిరిజన సహకార సంస్థ” చైర్మన్ గా – కిడారి శ్రావణ్ కుమార్.

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( అల్లూరిజిల్లా) జిల్లా ఇంచార్జ్ : అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు పార్లమెంట్, తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు రాష్ట్ర గిరిజన సహకార సంస్థ అధ్యక్షునిగా నియమిస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ చేపట్టే అన్ని రకాల, కార్యక్రమాలను నిర్విరామంగా చేపడుతూ అరకు పార్లమెంట్ పరిధిలో, పార్టీ అభివృద్ధికి విశేషంగా కృషి చేయడం జరిగింది. ఆయన చేసిన పనులకు గుర్తింపుగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం శనివారం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో క్యాబినెట్ హోదా కలిగిన రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ గా నియమిస్తూ ఆదేశాలను జారీ చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page