జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 09 at 19.25.39

TRINETHRAM NEWS

చాగంటి కి అదిరిపోయే పోస్ట్ ఇచ్చిన చంద్రబాబు

Trinethram News : Andhra Pradesh : ఏపీ కూటమి ప్రభుత్వం మళ్లీ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ రెండో జాబితాను ప్రకటించింది. ఇప్పటికే కొన్ని నెలల క్రితం తొలి జాబితా విడుదల చేసిన ప్రభుత్వం, ఇప్పుడు కొత్తగా 59 మంది నామినేటెడ్ సభ్యులను నియమించింది. ఈ జాబితాలో ప్రభుత్వం సామాజిక సమీకరణాల దృష్టితో పాటు విధేయతకు పెద్దపీట వేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ జాబితాలో రాష్ట్ర సలహాదారులు, ఆర్టీసీ రీజనల్ బోర్డు ఛైర్మన్లు, డెవలప్మెంట్ కార్పొరేషన్‌లు, అర్బన్ డెవలప్మెంట్ అధారిటీలు వంటి వివిధ నియామకాలను ప్రకటించింది. సుమారు అన్ని సామాజిక వర్గాలను ప్రాతినిధ్యం కల్పిస్తూ నియామకాలు జరిగినట్టు తెలుస్తోంది

ఈ జాబితాలో మైనార్టీ అఫైర్స్ సలహాదారుగా మహమ్మద్ షరీఫ్, విద్యార్థి నైతిక విలువల సలహాదారుగా చాగంటి కోటేశ్వర్ రావు, ఆర్టీసీ రీజనల్ బోర్డు ఛైర్మన్లుగా దోన్ను దొర, రెడ్డి అప్పల నాయుడు, సురేష్ రెడ్డి, పోలా నాగరాజు నియమితులయ్యారు. వీటితో పాటు వివిధ వర్గాలకు చెందిన వెల్ఫేర్ కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లు నియమించబడ్డారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page