జూన్ 27, 2026

WhatsApp Image 2024 11 09 at 16.28.49

TRINETHRAM NEWS

రైతు కళ్ళలో ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..

వడ్లు కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తాం..

సన్నడ్లకు క్వింటాలుకు రూ. 500 బోనస్..

యాసంగికి అనురాధ కార్తెలో నార్లు పోయాలి.. పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రైతుల కళ్ళలో ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట, అందుగులపల్లి, బ్రాహ్మణపల్లి, రాగినేడు, కనగర్థి, కాపులపల్లి, కాసులపల్లి, గోపయ్యపల్లి, పాలితం, బొంపెళ్లి, మేరపల్లి, తుర్కల మద్ధికుంట గ్రామాల్లో అలాగే పెద్దపల్లి పట్టణంలోని చందపల్లి లో శనివారం రోజున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయరమణ రావు ప్రారంభించారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ..

ధాన్యంలో ఎలాంటి కటింగ్ లేకుండా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ చెల్లిస్తామని రైతులు భరోసాగా ఉండాలని తెలిపారు. దళారుల చేతిలో మోసపోవద్దని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, వాటిని రైతుకు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రతి గింజ సన్న వడ్లకు బోనస్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇచ్చారు. నిబంధనలు మేరకు ధాన్యంలో తేమ శాతం ఉండేలా రైతులు ధాన్యాన్ని ఆరబోయాలని సూచించారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యం ఉంటే వేరువేరుగా ఉంచాలని మిలర్లతో మాట్లాడి సపరేటుగా మద్దతు ధరకు కొనుగోలు చేయించే భాధ్యత నాదేనని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రానున్న యాసంగి సాగుకు అనురాధ కార్తెలో నార్లు పోయాలని, తద్వారా అనుకూల వాతావరణంలో పంట చేతికి వస్తుందని అన్నారు. యాసంగిలో తెగుళ్లను తట్టుకునే వరి రకాలను సాగు చేసుకోవాలని రైతులకు వివరించారు. 1010, 64, 118 రకాల యాసంగికి అనుకూలమన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజా పాలనలో రైతులకు మేలు చేయడమే కాంగ్రెస్ సర్కార్ లక్ష్యమన్నారు.

ఈ కార్యక్రమాల్లో మార్కెట్ ఛైర్మన్ ఈర్ల స్వరూప, సింగిల్ విండో ఛైర్మన్ చింతపండు సంపత్, మాజీ జడ్పీటిసి బండారి రాంమూర్తి, సందవేణ రాజేందర్, సత్యనారాయణ రెడ్డి, అరే సంతోష్, ఏదల్లి శంకర్, కూర మల్లారెడ్డి, ప్రమేష్, విజయ్, రాజయ్య, నెటట్ల కుమార్, వెంకటేష్, శ్రీనివాస్,ఐకెపి ఏపిఎం సంపత్, సింగల్ విండో సిఈఓ తిరుపతి, మాజీ సర్పంచులు, ఎంపీటీసిలు, కాంగ్రెస్ నాయకులు, డైరెక్టర్లు, రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page