జూన్ 27, 2026

IMG 20241108 WA0025

TRINETHRAM NEWS

పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు ఏనుముల.రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ . అర్ధ.సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వికారాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అంబేద్కర్ కూడలిలో కేక్ కట్ చేసి అనంతరం ప్రజలకు అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు, పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల అధ్యక్షులు మరియు కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా నాయకులందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page