TRINETHRAM NEWS

ధర్మారం పోలీస్ స్టేషన్ సందర్శించిన సిపి

బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది అనే నమ్మకం, భరోసా కల్పించాలి పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,

ధర్మారం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ధర్మారం పోలీస్ స్టేషన్ లను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) కమీషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ల విజిట్ లో భాగంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న సీపీ పోలీస్ స్టేషన్ సిసిసి పిటిషన్ ల వాటి రికార్డ్ లను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, నమోదు చేయబడిన కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ప్రజలతో, ఫిర్యాదుదారులతో ఎలా ప్రవర్తిస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ రికార్డ్స్ తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిధి బౌగోలిక పరిస్థితులు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే తదితర అంశాలను ఎస్ఐ ని అడిగి తెలుసుకున్నారు. సీపీ పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, వారు చేస్తున్న విధులు, పని తీరు, వారికీ ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పిర్యాదుల విషయం లో వెంటనే స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలి అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేయాలని ప్రమాదాలు ఎక్కవ జరిగే ప్రదేశాలను బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి పోలీసు అధికారులు రెవెన్యూ రవాణా,నేషనల్ హైవే అథారిటీ, గ్రామ పంచాయతీ, రోడ్డు భవన్ ల శాఖ వారి సమన్వయంతో ప్రమాదాలకు గల కారణాలను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాలని అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్స్, సైన్ బోర్డ్స్, రిఫ్లెక్టర్స్, స్టడ్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు, పిర్యాదులు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని, గంజాయి,మత్తు పదార్థాల, పిడియస్ రైస్, గుడుంబా సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, సేవించడం వంటి వాటిపై, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని, చట్టం వ్యతిరేకమైన కార్యకలా పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు , పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ లక్ష్మణ్ ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App