ఎస్.ఐ శ్రీరాముల శ్రీను బలవణ్మరణానికి కారణమైన సిఐ కంది జితేందర్ రెడ్డిని అరెస్టు చేయాలని
వీసీ కె పార్టీ పెద్దపల్లిజిల్లా కన్వీనర్ బొజ్జపెల్లి సురేష్ డిమాండ్.
పెద్దపెల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఎస్.ఐగా విధులు నిర్వహించిన శ్రీరాముల శ్రీనును పై అధికారి కందికంటి జితేందర్ రెడ్డి కులం పేరుతో వేధించాడు. ఆ వేధింపులకు గాయపడి జూన్ 30 నాడు శ్రీరాములు శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. జులై 7న మరణ వాంగ్మూలం ఇచ్చాడు. నిందితులకు ఇచ్చిన ముందస్తు బేయిల్ రద్దు చేసి వెంటనే అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, మృతుడి భార్యకు గ్రూప్ వన్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా
డాక్టర్ జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ,నిన్న రాహుల్ గాంధీ సామాజిక న్యాయం ను ప్రస్తావిస్తూ ఈ దేశంలో కుల వివక్ష ఉందని వాటికి వ్యతిరేకంగా సమానత్వం కోసం సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ పని చేయాలనీ తెలిపారు. కానీ దళిత ఎస్ఐ శీను పై కుల వివక్ష ప్రదర్శించి అవమానాలకు గురిచేసి ఆత్మహత్యకు కారకుడైన అగ్రకుల సిఐ జితేందర్ రెడ్డి కి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉండడం చూస్తే కేంద్ర నాయకుల అవగాహన ఒక రకం, రాష్ట్ర నాయకుల అవగాహన మరోరకంగా ద్వంద నీతిని ప్రదర్శిస్తుందని తెలిపారు.
ఇప్పటికైనా సిఐ జితేందర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని లేకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ముందుకు నడిపిస్తామని ఈ సందర్భంగావీసీ కె పార్టీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బొజ్జపెల్లి సురేష్ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App