WhatsApp Image 2024 11 06 at 3.18.34 PM
కొయ్యూరు : పాత బాలారంలో తాటాకు ఇల్లు దగ్ధం. సర్పంచ్ తక్షణ సహాయం.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు మండలం ) అల్లూరిజిల్లా ఇంచార్జ్ : అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని పాత బాలరం గ్రామంలో, నాగులపల్లి అర్జున, నాగులపల్లి కొండబాబుకి చెందిన ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల, బుధవారం ఉదయం పదకొండు గంటల సమయంలో కాలిపోయాయి. దీంతో రెండు కుటుంబాలు కట్టు బట్టలతో మిగిలారు. వెంటనే బాధితులకు తక్షణ సహాయంగా పదివేల రూపాయలు సర్పంచ్ అప్పన అప్పలనర్స అందించారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ, సహకారాలు అందేలా చూడాలని ఎమ్మార్వో, ఎంపీడీవో లతో సర్పంచ్ మాట్లాడారు . దాతలు సహాయంతో త్వరలోనే రెండు కుటుంబాలకు రేకుల షెడ్ నిర్మించడానికి, కృషి చేస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
