3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని గఫ్ఫాలు కొట్టుకుంటున్న కూటమి సర్కార్

TRINETHRAM NEWS

Trinethram News : విజయవాడ

వైఎస్ షర్మిలా రెడ్డి
ఏపీసీసీ చీఫ్

3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని గఫ్ఫాలు కొట్టుకుంటున్న కూటమి సర్కార్…

విద్యుత్ సర్దుబాటు చార్జీలతో మరోవైపు వాతలు పెడుతోంది.

“ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే” ఇదే మరి.

ఉచిత సిలిండర్ల పథకం కింద ఏడాదికి ఇచ్చేది రూ.2685 కోట్లు..

ప్రజల దగ్గర నుంచి కరెంటు బిల్లుల రూపంలో ముక్కుపిండి అదనంగా వసూలు చేసేది రూ.6వేల కోట్లు.

ఇంకా రూ.3వేల కోట్లు ప్రజలపైనే అధనపు భారం పడుతుంది కదా .

దీపం – 2 కింద వెలుగులు పక్కన పెడితే ..

కరెంటు బిల్లుల రూపంలో కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం నింపేది కారు చీకట్లు.

గత వైసిపి చేసిన పాపమే ఇదని, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని,

బిల్లుల వసూళ్లకు అనుమతి ఇచ్చింది APERC తప్ప.. మేము కాదని,

చెప్తున్నవి కుంటి సాకులు తప్ప మరోటి కాదు.

గత ప్రభుత్వం 9 సార్లు చార్జీలు పెంచిందని,

తాము అధికారంలోకి వచ్చాక.. ఒక్క రూపాయి కూడా అదనపు భారం మోపమని,

అవసరం అయితే 35 శాతం చార్జీలు తగ్గిస్తామని హామీలు ఇచ్చారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు చార్జీలు పెంచితే, మీరూ మొదలుపెట్టారు కదా.

మీకు వాళ్లకు ఏంటి తేడా ? 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.35 వేల కోట్లు ప్రజలపై భారం మోపితే,

మీరు కూడా భారం మోపడం మొదలు పెట్టారు కదా. మీకు వాళ్లకు ఏంటి తేడా.

రూ.6వేల కోట్లు ప్రజలపై మోపడం భావ్యం కాదు.

బీజేపీ కి మద్దతు ఇస్తున్నారు కదా… సాయం తీసుకురండి.

ప్రభుత్వమే ఈ భారం మోయాలని డిమాండ్ చేస్తున్నాం.

ప్రజలపై సర్దుబాటు చార్జీల భారాన్ని మోపినందుకు నిరసనగా ఈ నెల 5 న, @INC_Andhra కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తుంది…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top