హోంగార్డ్స్ అధికారులు కూడ పోలీస్ డిపార్ట్మెంటు కుటుంబంలో భాగమే. జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి, IPS.

TRINETHRAM NEWS

హోంగార్డ్స్ అధికారులు కూడ పోలీస్ డిపార్ట్మెంటు కుటుంబంలో భాగమే. జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి, IPS.
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
జిల్లా ఎస్పీ కె. నారాయణ రెడ్డి, IPS ఈ రోజు జిల్లా హోం గార్డ్స్ అధికారులతో దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ముందుగా హోంగార్డ్స్ అధికారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డ్స్ అధికారులు కూడ పోలీస్ కుటుంబం లో భాగమే. ప్రతి ఒక్కరు సమయపాలన పాటిస్తూ,క్రమశిక్షణతో మెలగాలని, తము పనిచేసే చోట్లలో అంకిత భావం తో పని చేయాలనీ,పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ప్రతి అధికారి పై స్థాయి నుండి క్రింది స్థాయి వరకు కలసికట్టుగా, సమన్వయం తో కలసి పని చేసినప్పుడే జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ కు మంచి పేరు వస్తుంది.ఎవరు కూడ జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ కు చెడు పేరు వచ్చే విధంగా ప్రవర్తించ వద్దు. హోంగార్డ్స్ అధికారులు తెలిపిన సమస్యలు తన (జిల్లా ఎస్పీ) పరిధిలో ఉన్న వాటిని పరిశీలించి వెంటనే పరిష్కరిస్తాం, ఉన్నత అధికారులు, ప్రభుత్వానికి సంబంధించిన విషయాలను కూడ వెంటనే ఉన్నత అధికారుల దృష్టికి మరియి ప్రభత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది అని హోంగార్డ్స్ అధికారుల సమస్యల పైన ఎస్పీ సానుకూలంగా స్పందించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో హోంగార్డ్స్ అధికారులు తమ సమస్యలకు సమబంధించిన మెమోరాండంను జిల్లా ఎస్పీ కి అందించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో RI డేవిడ్, జిల్లా హోంగార్డ్స్ ప్రసిడెంట్ సుధాకర్,తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ చాంద్ పాషా,జిల్లా లోని హోంగార్డ్స్అధికారులు,తదితరులు పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top