TRINETHRAM NEWS

పోలీస్ కమిషనరేట్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

అందరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..

సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త ఉండాలి

ఏకే 47,కార్బన్, ఎస్ఎల్ ఆర్, పిస్టల్ తో పాటు పలు ఆయుధలపై అవగాహన

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) కార్యక్రమాల్లో భాగంగా

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్లో పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ముఖ్య అతిథిగా పాల్గొని ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రారంభించారు
.
గోదావరిఖని పట్టణంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థులు, ప్రైవేటు పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు దాదాపు 1000 మంది ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ స్వయంగా పిల్లలకు ఆయుధాల గురించి, బీడీ టీమ్ ఎక్విప్మెంట్, పోలీసు చట్టాల గురించి, షీ టీమ్స్, భరోసా సెంటర్స్ గురించి, కమ్యూనికేషన్ సిస్టం గురించి ఫింగర్ ప్రింట్ డివైస్ ల వల్ల కలిగే ఉపయోగాల గురించి, డాగ్ స్క్వాడ్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి మరియు సైబర్ నేరాల గురించి వివరించారు.

పోలీసులు ఉపయోగిస్తున్న ఆయుధాల గురించి, ఏకే 47, ఎస్ఎల్ఆర్, కార్బన్, 9mm పిస్తాల్, బీడీ టీమ్, ఫింగర్ ప్రింట్, క్లూస్ టీమ్, షీటీమ్, భరోసా,రోడ్డు ప్రమాదాలు స్పీడ్ లేజర్ గన్, ట్రాఫిక్ రూల్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్, డాగ్ స్క్వాడ్స్, సైబర్ క్రైమ్ తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు సిబ్బంది విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాల సంస్మరణ వారోత్సవాల లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్లు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగా ఈరోజు కమిషనరేట్ హెడ్ క్వార్టర్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని దీనిలో విద్యార్థిని విద్యార్థులకు ఆయుధాలు, షీ టీమ్స్, ట్రాఫిక్, పోలీస్ విధులు, ఫింగర్ ప్రింట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్, డాగ్ స్క్వాడ్ మరియు ప్రజల లక్షణా కోసం పోలీసులు చేస్తున్న విధుల గురించి అవగాహనా కల్పించడం జరిగింది అదేవిదంగా ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని సైబర్ నేరాల వలలో పడకుండా తీసుకోవలసిన జాగ్రత్త చర్యల గురించి విద్యార్థినీ విద్యార్థులకు వివరించారు.

సైబర్ నేరాలు సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయో,సైబర్ నేరం జరగగానే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ల గురించి విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది అన్నారు. పోలీసు చట్టాలు పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి విద్యార్థినీ విద్యార్థులకు కమ్యూనికేషన్ మ్యాన్ ప్యాక్, విహెచ్ఎఫ్ సెట్ ల గురించి అవగాహన కల్పించడం జరిగింది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రాంగ్ రూట్లో వస్తే ఎలా ప్రమాదాలు జరుగుతున్నాయి హెల్మెట్ పెట్టుకోకపోతే ఎలా ప్రమాదాలు జరుగుతున్నాయి మరియు తదితర అంశాల గురించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. మరియు బాలికలు మహిళల రక్షణకు ఏర్పాటుచేసిన భరోసా కేంద్రం యొక్క సేవల గురించి షీ టీమ్స్ పని తీరు, ఉండే వివిధ యాప్ ల గురించి అవగాహన కల్పించడం జరిగింది. గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి, డయల్ 100, గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది అన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, ఏ ఆర్ ఏ సి పి ప్రతాప్, ఆర్ ఐ దామోదర్ సంపత్, మల్లేశం, ఆర్ ఎస్ ఐ లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App