ప్రభుత్వ లాంఛనాలతో రతన్ టాటా అంతక్రియలు పూర్తి

TRINETHRAM NEWS

Trinethram News : అక్టోబర్ 10 2024

పార్సీ సమాజానికి చెందిన రతన్ టాటా అంత్యక్రియ లు హిందూ సంప్రదాయం ప్రకారమే నిర్వహించారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ముంబైలోని వర్లీ విద్యుత్‌ శ్మశానవాటికలో ఈ కార్యక్రమం జరిగింది. దాదాపు 45 నిమిషాల పాటు ప్రార్థనల అనంతరం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియ నిర్వహించారు.

హిందూ సంప్రదాయం ప్రకారమే టాటా అంత్యక్రి యలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆయన పార్సీ సమాజానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ హిందూ సంప్రదాయంలోనే అంత్య క్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు..

ఈరోజు సాయంత్ర 4 గంటలకు ముంబైలోని వర్లీ విద్యుత్‌ శ్మశానవాటికలో టాటా అత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో పూర్తి చేసింది. ఆయన అంత్యక్రియలకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖు లు, దిగ్గజ వ్యాపారవేత్తలు, పాల్గొని వీడ్కోలు పలికారు…..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top