TRINETHRAM NEWS

చొప్పదండి : త్రినేత్రం న్యూస్

తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లా, ప్రతి గ్రామం, పల్లెలల్లో పూల పండుగ బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటబోతున్నాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరుపుకునే బతుకమ్మను తొమ్మిది రోజుల పాటు కనుల పండువగా జరుపుకుంటారు.
చిన్నా, పెద్దా అంతా రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో సందడి చేస్తారు. ఈ పండగ వేళ ప్రతీ ఇల్లు ఆడపడుచులు, చిన్నారుల చిరునవ్వులు, బంధుమిత్రులతో కోలాహలంగా ఉంటుంది. తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకల్లో గౌరీ దేవిని రోజుకో రూపంతో కొలుస్తారు. తొమ్మిదో రోజు అంటే చివరి రోజు. ఈ రోజున అమ్మవారిని ‘సద్దుల బతుకమ్మ’గా అభివర్ణిస్తారు.
చొప్పదండి మండలం లో ప్రతి యెడు లాగే ఈసారి బతుకమ్మ వేడుకలు ఈ ఎనిమిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. నేడు చివరి రోజు తొమ్మిదో రోజు చివరి రోజు కావడం తో ప్రతి ఇంట్లో బతుకమ్మ ఏర్పాట్ల కు కావలసిన ఏర్పాట్లు చేయనుకున్నారు. అదేవిదంగా చొప్పదండి పట్టణ కేంద్రం తో పాటు మండలం లోని అన్ని గ్రామాల్లోకి బతుకమ్మ వేడుకలు జరుపుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లో నిమగ్నం అవడం తో పాటు నిమర్జన ప్రాంతాల్లో లైటింగ్ స్ సైతం ఏర్పాట్లు చేస్తున్నారు.
సద్దుల బతుకమ్మ ప్రత్యేకతలు..

చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు సందడి మామూలుగా ఉండదు.. పల్లె, పట్టణాలు సంబరాలతో హోరెత్తి పోతాయి. ప్రత్యేక నైవేద్యాలు, ఆటపాటలతో బతుకమ్మ మీద కొలువైన గౌరమ్మను ఆ తల్లి గంగమ్మ ఒడికి చేర్చి.. మళ్లీ ఏడాది వరకు బతుకమ్మ కోసం ఎదురుచూసే రోజు ఇది. సద్దుల బతుకమ్మ నాడు అమ్మవారికి సత్తుపిండి, పెరుగన్నం, పులిహోర, మలీద ముద్దలు, కొబ్బరన్నం, నువ్వులన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. తంగేడు, గునుగు, బంతి, చామంతి, మందారం, గుమ్మడి తీరొక్క పూలతో బతుకమ్మను ఏడు వరుసలుగా బతుకమ్మను పేర్చడం అయ్యాక. పైన పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి పూజిస్తారు.

సాయంకాలం ఊరంతా బతుకమ్మలను ఒక చోట చేర్చి.. వాటిని మధ్యలో పెట్టి.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో…. ఒక్కేసి పువ్వేసి చందమామ… ఒక్కజాములాయే చందమామ… అంటూ బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలు వేస్తారు. అనంతరం ఊరంతా బతుకమ్మలను తల పై పెట్టుకొని చెరువు వైపు వెళ్తారు. చెరువు దగ్గరకు వచ్చాక బతుకమ్మను గంగమ్మ ఒడిలో జారవిడుస్తారు. ఆ తర్వాత ఆడపడుచులంతా దేవికి సమర్పించిన సత్తుపిండి, పెరుగన్నం, పులిహోర, మలీద ముద్దలు, కొబ్బరన్నం, నువ్వులన్నం నైవేద్యాన్ని ఒకరికొకరు తినిపించుకుంటారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App