జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 29 at 10.22.02 AM

TRINETHRAM NEWS

Barrelakka Complaint on RGV: ఆర్జీవీపై బర్రెలక్క ఫిర్యాదు.. మహిళా కమిషన్‌లో కేసు నమోదు!

హైదరాబాద్‌ : సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ వ్యూహం సినిమాపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలను అడ్డుకోవడానికి టీడీపీ నేతలు చేయని ప్రయత్నం లేదు. ఈ మువీపై జనసేన, టీడీపీ నేతలు, ఆర్టీవీ మధ్య గత కొంత కాలంగా మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో జనసేన నేత పవన్‌ను విమర్శించడానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫేమస్‌ అయిన బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీష పేరును వాడుకోవడం వివాదంగా మారింది. తాజాగా వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రామ్ గోపాల్ వర్మ బర్రెలక్క పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దీనిపై ఆమె తరపున లాయర్‌ రామ్‌ గోపాల్‌ వర్మపై గురువారం మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శిరీష తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘వ్యూహం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా ‘ఊరు.. పేరు లేని ఆవిడ.. బర్రెలక్కగా చాలా ఫేమస్‌ అయిపోయింది’.. అని ఆర్జీవీ అవమానకరంగా మాట్లాడినట్లు తెలిపారు.

You cannot copy content of this page