జూన్ 27, 2026

WhatsApp Image 2024 09 05 at 13.31.27

TRINETHRAM NEWS

KCR is not visible.. Posters in Hyderabad

Trinethram News : బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కనబడుటలేదు అంటూ హైదరాబాద్ లో పోస్టర్లు వెలిశాయి. రెండు సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదల్లో ఇబ్బందులు పడుతుంటే పత్తాలేని ప్రతిపక్ష నేత కేసీఆర్ అంటూ పోస్టర్లలో రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది కాంగ్రెస్ పనే అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గత కొంతకాలంగా కేసీఆర్ బయటకు రావడం లేదు. అసెంబ్లీ బడ్జెట్ టైమ్ లో మాత్రమే ఆయన కనిపించారు.

ఎక్కువగా ఫాంహౌస్ లోనే ఉంటున్నారు. ఇటీవల వరద బాధితులను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. కేసీఆర్ బయటకు వచ్చి ప్రజల కష్టాలను తెలుసుకుని కేసీఆర్ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలంటూ కామెంట్స్ చేశారు. ఇక కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తూ ట్విట్టర్ లో పోస్టులు పెడుతూ రాజకీయం చేస్తున్నాడంటూ మండిపడ్డారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

KCR is not visible.. Posters in Hyderabad

You cannot copy content of this page