WhatsApp Image 2024 09 02 at 16.34.46
Another key issue in AP is the cancellation of the scheme
Trinethram News : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికీ రేషన్ బియ్య పథకం(Ration door delivery scheme) రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఎండీయూ వాహనాల వల్ల ప్రభుత్వానికి అదనపు భారం పడుతుందని తెలిపారు. అయినా అన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ వాహనాలు వెళ్లలేక వీధి చివరన వాహనాలు నిలిపడంతో అక్కడికి వెళ్లి ప్రజలు రేషన్ తెచ్చుకుంటున్నారని, అక్కడికి వెళ్లిన ప్రజలు రేషన్ దుకాణానికి వెళ్లలేరా అనే చర్చ కూడా జరిగింది.
అంతేకాకుండా వాహనాల ద్వారా అక్రమంగా బియ్యం రవాణా కూడా జరిగిందని ప్రభుత్వం దృష్టికి నాదెండ్ల మనోహర్ తీసుకొచ్చారు. దీంతో ఇంటింటికీ పథకం రద్దు చేసి వాహనాలను, రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి అన్న దానిపై త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
