సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో అందరికీ అష్టైశ్వర్యాలు చేకూరాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

TRINETHRAM NEWS

సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో అందరికీ అష్టైశ్వర్యాలు చేకూరాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

ఈరోజు 125 – గాజుల రామారం డివిజన్ హెచ్ఏఎల్ కాలనీ యందు గల శ్రీశ్రీశ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ ధర్మకర్త వెంకట సుబ్బయ్య యాదవ్ అధ్వర్యంలో నిర్వహించిన 27వ వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ సత్యనారాయణ స్వామిని పూజించడం ద్వారా జీవితంలోని కష్టాలు తొలగి సర్వ సుఖాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, పాక్స్ డైరెక్టర్ పరిశె శ్రీనివాస్ యాదవ్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ అద్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ రాంరెడ్డి, పుప్పాల భాస్కర్, ఎత్తరి మారయ్య, అద్యక్షులు యాదగిరి యాదవ్, నాయకులు పి.శ్రీనివాస్, ధని సింగ్, నాగరాజ్ గౌడ్, కే.చంద్ర శేఖర్ రావు, రాజేశ్వర్ రావు, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top