జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 22 at 18.31.30

TRINETHRAM NEWS

CP inspected the police vehicles

రామగుండం పోలీస్ కమీషనరేట్

పోలీసు వాహనాలను తనిఖీ చేసిన సీపీ

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమీషనరెట్ పరిధి మంచిర్యాల జోన్ బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసు వాహనాల పనితీరు వాటి నిర్వహణను రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ ఐపిఎస్.,(ఐజీ) కమీషనరెట్ హెడ్ క్వార్టర్స్ లో పరిశీలించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జోన్ లలోని పోలీస్ స్టేషన్ ల పరిధిలో గల పోలీస్ వాహనాలు నిరంతరంగా వివిధ ప్రజాసేవలకు, ఎలాంటి ఆటంకం కలగకుండా సాఫీగా ప్రజా సేవలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. వాహనాల నిర్వహణ లోటుపాట్లపై నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి సమగ్ర నివేదికను నెలవారీగా సమర్పించాలని మోటార్ వాహనాల అధికారులకు కు తెలియజేశారు.

వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ వహించలని మంచి కండిషన్లో ఉంచుకోవాలని వాహన డ్రైవర్లకు ఆదేశించినారు. పోలీసు అధికారుల ఆధీనంలో ఉన్న వాహనాలను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సొంత వాహనంలా మంచి కండిషన్లో ఉంచి ఎప్పటికప్పుడు సర్వీసింగ్, ఇంజన్ ఆయిల్, టైర్ల నిర్వహణ ఉత్తమ ప్రమాణాలను పాటించుకుంటూ డ్రైవర్లకు నిర్వహణపై ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర, ఏ ఆర్ ఏసీపీ సురేంద్ర, రిజర్వ్ ఇన్స్పెక్టర్ MTO సంపత్, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CP inspected the police vehicles

You cannot copy content of this page